TS SSC 10th Class Advanced Supplementary Results on Today
mictv telugu

నేడు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్

September 2, 2022

రాష్ట్రంలో నేడు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలు www.bse.telangana.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పరీక్షల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోయినా విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన చెప్పారు. చదువొక్కటే జీవితం కాదని.. దానికి మించినవి చాలా ఉన్నాయని అన్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి పనులు చేయకూడదని సూచించారు. వచ్చే సంవత్సరం మళ్లీ కష్టపడి పరీక్షలు రాయొచ్చని.. కన్నవాళ్లకు గుండెకోత మిగల్చొద్దని కోరారు. విద్యార్థులంతా ధైర్యంగా ఉండి ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించేలా సన్నద్ధం కావాలని అన్నారు.

అయితే.. నిజానికి సెప్టెంబర్‌ 10వ తేదీలోపు పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావించారు. కానీ, తెలిపిన సమయం కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. 10వ తరగతి ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.