TSAT is sweet for Group-1 candidates..
mictv telugu

గ్రూప్-1 అభ్యర్థులకు టీశాట్ తీపికబురు..

July 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు, గ్రూప్-1 అభ్యర్థులకు టీశాట్ ఓ తీపికబురు చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల కోసం, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుపేద అభ్యర్థుల కోసం టీశాట్ ఛానెల్ ద్వారా సబ్జెక్ట్ నిపుణులు రోజు పాఠాలు చెప్తున్న విషయం తెలిసిందే. ఈ పాఠాలకు సంబంధించి టీశాట్ అధికారులు మరో నిర్ణయం తీసుకున్నట్లు టీశాట్ సీఈవో రాంపురం శైలేశ్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ..”టీశాట్ ఛానెల్ ద్వారా గ్రూప్-1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం నేటీ నుంచి మరోగంట అదనంగా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నాం. ఇప్పటికే టీశాట్ ద్వారా తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఎనిమిది పాఠ్యాంశాలను ప్రతిరోజూ మూడు గంటలపాటు ప్రసారం చేస్తున్నాం. ఇక నుంచి మరో గంటపాటు అదనంగా క్లాసులను చెప్తాం. అంటే రోజుకు 4 గంటలపాటు గ్రూప్-1 పాఠ్యాంశాలను బోధించబోతున్నాం. సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు టీశాట్ ఛానెల్‌లో, మళ్లీ ఉదయం విద్య ఛానల్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రసారాలు ఉంటాయి. నాలుగు గంటల్లో ఒక గంట ఇంగ్లిష్ పాఠ్యాంశాలు ఉంటాయి. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ఆమె అన్నారు.