తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫిజికల్ ఈవెంట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలైన మహిళలను ఫిజికల్ ఈవెంట్ల నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో పలువురు మహిళలు గర్భం దాల్చడంతో ఈవెంట్లకు హాజరుకాలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాజా నిర్ణయం తీసుకున్నారు. వీరు డైరెక్ట్ గా మెయిన్స్ పరీక్షలకు హాజరు కావచ్చు. అందులో పాసైతే నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మేరకు రూపొందించిన నియమావళిని అంగీకరిస్తూ గర్భిణీ స్త్రీలు లేఖ రాసివ్వాలనే నిబంధన విధించారు.
13,404 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు