TSLPRB is a new record
mictv telugu

రికార్ట్ దిశగా..టీఎస్‌ఎల్పీఆర్బీ

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ఎల్పీఆర్బీ కొత్త రికార్డ్‌ను సృష్టించబోతోంది. ఈ నెల 28న నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రిలిమ్ పరీక్షకు సంబంధించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోబోతుంది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఆ తర్వాత మళ్లీ అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనుందని వివరాలను వెల్లడించారు. ”ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖలో మొత్తం 15,844 కానిస్టేబుల్ పోస్టులు, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకుగాను మొత్తం 6,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వ హించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల 28కి వాయిదాపడింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు” అని టీఎస్ఎల్ఫీఆర్బీ అధికారులు తెలిపారు.

మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న జరగబోయే కానిస్టేబుల్ పరీక్షకు 6.5 లక్షల మంది హాజరుకానున్నారు. గతవారం ఎస్సై పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్ పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తాజాగా అధికారులు వెల్లడించారు.