TSLPRB postpones TS Police PC exam date 2022; check notice here
mictv telugu

తెలంగాణ: కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా

August 9, 2022

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీని మారుస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాల వల్ల తేదీని మార్చినట్లు నియామక బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఎస్సై రాత పరీక్ష జరిగింది. కానిస్టేబుల్ పరీక్ష కూడా వచ్చే ఆదివారం (ఈ నెల 21 న) జరగాల్సి ఉండగా.. ఈ నెల 28 కి వాయిదా వేశారు. కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్‌ పరీక్షలకు హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు గతంలోనే తెలిపారు.