ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ… అంతకుముందు ఉత్తీర్ణులు కానివారికి కూడా మరో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక పరీక్షలో ఏడు ప్రశ్నల మార్కుల కారణంగా గతంలో ఫెయిల్ అయిన వారు హైకోర్టును ఆశ్రయించడంతో.. తాజాగా కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులయ్యారు. ఇలా దాదాపు 52 వేల మందికి పైగా అభ్యర్థులు మళ్లీ పోటీలో నిలిచారు. వీరందరికీ ఈరోజు నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నాయి. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.
అంతకుముందు మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో డిసెంబరు 8 నుంచి 31 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించింది. వీరిలో 1,75,657 మంది అర్హత ప్రస్తుతం మెయిన్స్ రాతపరీక్షకు సాధించారు. ఈక్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది పోటీ పడనున్నట్లు తెలిసింది. కానీ తాజాగా మరో 52 వేల మంది కూడా ఈవెంట్స్ కి అర్హత సాధించండంతో మరికొందరు ఇందులో ఉత్తీర్ణులై పోస్టులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.