తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

October 28, 2017

తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేశారు. 2011లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను సాయంత్రం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. వివిధ ఉద్యోగాలకు 121 మందిని ఎంపికచేసినట్లు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఏడేళ్లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు.