తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జనవరి 22న జరగనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను TSPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. AEE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC ID , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 22న మొదటి సెషన్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి..పరీక్ష సమయానికి కనీసం 45 నిమిషాల ముందు అభ్యర్థులు తమ నిర్దేశిత పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TSPSC సూచించింది. అభ్యర్ధులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.