పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీక్ అయ్యిందని నిర్ధారణ కావడంతో పరీక్షను రద్దు చేశారు. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షను నిర్వహించారు.ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. వివిద ఇంజినీరింగ్ విభాగాల్లో 837 పోస్టులకు పరీక్ష జరిగింది. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొని పరీక్ష రాశారు.