తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తన అధికారిక వెబ్సైట్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్/లైబ్రేరియన్ సహా ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటీసును విడుదల చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ వంటి 544 పోస్టుల భర్తీకి కమిషన్ ఇండక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు TSPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం 20 ఫిబ్రవరి 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31 జనవరి 2023 నుండి ప్రారంభమవుతుంది.
ఎన్ని ఖాళీలు ఉన్నాయి..
అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం 544 పోస్టులు
ఇంగ్లీష్ -23
తెలుగు-27
ఉర్దు-2
సంస్క్రుతం-5
స్టాటిస్టిక్స్-23
మైక్రో బయాలజీ – 5
బయోటెక్నాలజీ-9
న్యూట్రిషన్-5
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-311
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ -39
కామర్స్–8
డైరీ సైన్స్- 8
క్రాప్ ప్రొడక్షన్-4
డేటా సైన్స్-12
ఫిషరీస్-3
కామర్స్ -ఫారిన్ ట్రేడ్ -1
టాక్సేషన్-6
ఫిజికల్ డైరెక్టర్ – 29
లైబ్రేరియన్ -24
పోస్టుల విభజన, విద్యార్హత, వయస్సు, జీతం సహా ఇతర సూచనలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ 31/01/2023 నుండి కమిషన్ వెబ్సైట్లో (https://www.tspsc.gov.in) అందుబాటులో ఉంటాయని అభ్యర్థులు గమనించాలి.
TSPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు ముందుగా అధికారిక www.tspsc.gov.inకి వెళ్లాలి.
హోమ్ పేజీలో వచ్చే నోటిఫికేషన్ విభాగానికి వెళ్లాలి.
అక్కడ మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (LECTURERS),కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని ఫిజికల్ డైరెక్టర్లు,లైబ్రేరియన్లు (GENERAL RECRUITMENT)’, లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు TSPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ PDFని కొత్త విండోలో కనిపిస్తుంది.
TSPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి దాని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
అభ్యర్థులు TSPSC యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా TSPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం 31 జనవరి 2023 నుండి 20 ఫిబ్రవరి 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 31/01/2023 నుండి కమిషన్ వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో ఖాళీ వివరాలు, వయస్సు, జీతం, విద్యార్హత మరియు ఇతర వివరాల సూచనలతో సహా అన్ని వివరాలను పొందవచ్చు.