తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక కారణాల కారణంగా డిసెంబర్ 23న వాయిదా పడిన దరఖాస్తు ప్రక్రియను నేడు(డిసెంబర్ 30) తిరిగి ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణ సర్కార్ మొత్తం మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు TSPSC ప్రకటించింది. గత కొద్దిరోజులు తెలంగాణలో ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 29న 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. వీటి కోసం జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇంటర్మీడియట్తో సాఫ్ట్వేర్ కొలువు..గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశం
గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది.. పోస్టులు, ఇతర వివరాలు..