TSPSC has given notification for Division Accounts Officer Jobs
mictv telugu

తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్.. నిరుద్యోగులకు ఫీజు మినహాయింపు

August 6, 2022

వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లన విడుదల చేస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని గ్రేడ్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 44 ఏళ్ల వరకు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉండే ఈ రాత పరీక్షను డిసెంబరు 2022లో నిర్వహించే అవకాశాలున్నాయి. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుం కింద రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు రూ. 120. అయితే నిరుద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓసీ, క్రీడలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అర్హత డిగ్రీలో 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.