TSPSC has issued a notification for posts of State Women and Child Welfare Department Officer.
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్

September 5, 2022

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ స‌ర్కారు సోమవారం మ‌రో శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల అవుతుండ‌గా… తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) సోమవారం మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
అంతకుముందు శనివారం కూడా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.