TSPSC has issued notification for 175 posts in Municipal Department
mictv telugu

తెలంగాణలో మరో నోటిఫికేషన్.. ఈ సారి పోస్టులు 175

September 7, 2022

తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెప్తున్నారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రకటనలను గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు రాగా, బుధవారం మరో నోటిఫికేషన్ జారీ అయింది. పురపాలక శాఖలో ఖాళీగా ఉన్న 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం దరఖాస్తు తేదీలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాలకు కమిషన్ అధికారిక సైటును సందర్శించాలని కోరింది.