TSPSC has issued notification for 833 engineer posts
mictv telugu

తెలంగాణలో మరో నోటిఫికేషన్.. 833 ఇంజినీర్ పోస్టుల భర్తీ

September 12, 2022

TSPSC has issued notification for 833 engineer posts

వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల కళ్లల్లో సంతోషం నింపుతున్న తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.

ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఈ నెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని అభ్యర్ధులను కోరింది. కాగా, ఇటీవలే మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర శిశు, మహిళా సంక్షేమ శాఖలో 23 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగాలపై వస్తున్న ఎలాంటి నెగిటివ్ ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని సంస్థ సూచించింది. ఉద్యోగ సాధనలో ప్రభుత్వం తన వంతుగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచిందని వివరించింది.