tspscపేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీక్ కేసుపై tspscకి తాజగా సిట్ నివేదిక అందించింది. రాజశేఖర్ కీలక సూత్రధారి అని సిట్ తన విచారణలో తేల్చింది. ప్లాన్ ప్రకారమే tspscకి డిప్యూటేషన్ పై రాజశేఖర్ వచ్చినట్లు tspsc అందించింన నివేదికలో సిట్ పొందుపర్చింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ మరో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో సత్ససంబంధాలు కొనసాగించాడు. పథకం ప్రకారం పీసీ హ్యాక్ చేసి పాస్‌వర్డ్ రాజశేఖర్ దొంగలించాడు. అనంతరం పెన్ డ్రైవ్‌లో 5 పరీక్ష పత్రాలు రాజశేఖర్ కాపీ చేశాడు.
ఫిబ్రవరి 27నే పేపర్‌ను కాపీ చేసుకొని అనంతరం దానిని ప్రవీణ్ కు అందించాడు. ప్రవీణ్ ఏఈ పేపర్‌ను రూ.10 లక్షలకు రేణుకకు అమ్మేశాడు. గ్రూప్-1 పరీక్ష పత్రం కూడా లీకైనట్లు సిట్ గుర్తించింది.tspsc సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ..గ్రూప్-1 పరీక్ష పత్రం కొట్టేసినట్లు సిట్ నిర్ధారించింది.
మరోవైపు ప్రశ్నపత్రం లీకేజ్ కేసు నిందితులకు పోలీసుల కస్టడీకి కోర్టు ఆనుమతించింది. నిందితులకు 6 రోజుల కస్టడీ విధించింది. రేపటి నుంచి ఈనెల 23 వరకు కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 9 మంది నిందితులు ఉన్నారు.