టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేసులో ఇప్పటికే సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఏఈ, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లభించాయి.
టీఎస్‌పీఎస్సీ సర్వర్ల వివరాలను సైతం సేకరించారు. నేడు కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, ఛైర్మన్, కార్యదర్శి కంప్యూటర్లను పరిశీలించారు. ఛైర్మన్, కార్యదర్శి పేషీల్లో సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రాజశేఖర్ సాయంతో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ప్రశ్నపత్రాలను దోచేసినట్లు గుర్తించారు. ఆతర్వాత ప్రవీణ్ ప్రశ్నపత్రాలను రూ.10 లక్షలకు రేణుక, ఆమె భర్తకు విక్రయించారని తేల్చారు.
వారు ఇచ్చిన నగదును తన ఎస్బీఐ ఖాతాలో జమ చేసుకున్నాడ. దానిలో రూ.3.5 లక్షలను రాజమహేంద్రవరంలో ఉన్న తన బాబాయ్ ఖాతాకు బదిలీ చేశాడు. ప్రవీణ్‌తో ఎక్కువగా ఎవరెవరు కలిసి ఉంటారనే విషయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బేగంబజార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు తీసుకున్నారు. గురువారం అధికారులు టీఎస్పీఎస్సీకి నివేదిక ప్రాథమిక నివేదిక అందించనున్నారు.