tspsc paper leakage case police reveals incidents remand report
mictv telugu

ఒక్కో పేపర్‏కు రూ.20 లక్షలు..రేణుకే నడిపించింది

March 14, 2023

tspsc paper leakage case police reveals incidents remand report

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు, రిమాండ్ రిపోర్ట్‏లో కీలకమైన విషయాలను వెల్లడించారు. ఈ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందింతుడు ప్రవీణ్ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని ఎలా వర్కౌట్ చేశారో పూస గుచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్‏లో పేర్కొన్నాడు ప్రవీణ్.

TSPSC లో సెక్రటరీ పీఏగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కుమార్ ప్లాన్ వేసి మెయిన్ సర్వర్ నుంచే క్వశ్చన్ పేపర్‏ను దొంగిలించాడు. లూప్ ఉన్న కంప్యూటర్ల నుంచి పేపర్‏ను సేకరించాడు. ఆ తరువాత ఈ పేపర్ ప్రింటౌట్‏ను రేణుకకు ఇచ్చాడు.పేపర్‏ను అమ్మేందుకు రేణుకతో పాటు ఆమె ఫ్యామిలీ చాలా స్కెచ్‏లు వేసినట్లు ప్రవీణ్ తెలిపాడు. ఒక్కో పేపర్‏కు రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. రేణుక భర్త, బ్రదర్ ఇద్దరూ ఆమెకు ఈ విషయంలో హెల్ప్ చేశారు. పేపర్ తమ దగ్గర ఉందని వారి కమ్యూనిటీ మొత్తం చెప్పినా పెద్దగా ఎవరూ స్పందించలేదు.. వనపర్తికి చెందిన ఇద్దరు అభ్యర్ధులు అంత మొత్తం చెల్లించేందుకు ఊ అన్నారు. దీంతో రేణుక ఆ అభ్యర్ధులను ఏకంగా తన ఇంటికే రప్పించుకుని వారిని ప్రిపేర్ చేసింది. ఆ తరువాత సరూర్ నగర్‏లోని ఎగ్జామ్ సెంటర్‏కు తానే స్వయంగా దింపి వెళ్లిపోయిందని ప్రవీణ్ రిమాండ్ రిపోర్ట్‏లో వెల్లడించాడు. అదే విధంగా ప్రవీణ్ ఫోన్‏లోని మహిళల కాంటాక్ట్స్ విషయాన్ని కూపీ లాగారు పోలీసులు. అయితే ఇది హనీ ట్రాపా లేదా పక్కా స్కెచ్ వేసి చేస్తున్న కుంభకోణమా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

పేపర్ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న 9 మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పును ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం చంచల్‏గూడ జైలుకు వారిని తరలించారు.