అక్కలూ..గురుకుల పోస్టులు మీకే..! మరి ప్రిపేర్ గన్రిగ..! - MicTv.in - Telugu News
mictv telugu

అక్కలూ..గురుకుల పోస్టులు మీకే..! మరి ప్రిపేర్ గన్రిగ..!

August 2, 2017

గురుకుల పోస్టులన్నీ ఆడోళ్లయే అని తేలిపోయింది,తెలంగాణా గురుకుల పోస్టులకు హైకోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,1274జీవో మీద ఉన్న స్టేను ఎత్తేశింది, తెలంగాణ వ్యాప్తంగా మహిళా రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 546 పోస్టుల భర్తీ కోసం టీఎ్‌సపీఎస్సీ జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మహిళా అభ్యర్థులే అర్హులంటూ నోటిఫికేషన్లో పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు పురుష అభ్యర్ధులు హైకోర్టులో పిటీషన్ వేసారు,పురుష అభ్యర్ధుల పిటీషన్ పై స్టే ఇచ్చిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.అయితే ఈమద్య TSPSC నోటిఫికేషన్ రద్దైందని పుకార్లు కూడా వచ్చాయి,అయితే అధికారులు కేసుకోట్లో ఉందని పుకార్లను కొట్టిపారేసి క్లారిటీ ఇచ్చిన్రు ఇప్పుడేమో గురుకుల పోస్టులన్నీ ఆడవాళ్లకే అని హైకోర్టోళ్లు  క్లారిటీ ఇచ్చిన్రు. మహిళలూ…మరి ఇంకేంది త్వరలో సర్కారోళ్లు పెట్టే TSPSC పరీక్షకు సిద్దంగాన్రి,ఆల్ ది బెస్ట్.