తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ఖాళీ ఉన్న 22 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించింది. హార్టికల్చర్లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 01-07-2022 నాటికి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు తుది గడువు 2023 జనవరి 24 కాగా, పరీక్ష తేది 04-04-02023న నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్లో వచ్చే నెల 3 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది చక్కని అవకాశం.దీంతో పాటు పశుసంవర్దక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ చేసింది. ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు TSPSC వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ కార్యదర్శి తెలిపారు.