TSPSC released job notification in Veterinary and Horticulture departments
mictv telugu

వెటర్నరీ, హార్టికల్చర్ విభాగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

December 22, 2022

TSPSC released job notification in Veterinary and Horticulture departments

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు రాగా, ఆ లిస్టులో మరోటి చేరింది. తాజాగా వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. వెటర్నరీ పోస్టులకు డిసెంబర్ 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. హార్టికల్చర్ పోస్టులకు జనవరి 3 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఫీజు, వయసు తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in ని సందర్శించాలని సూచించింది.