తెలంగాణలో వస్తున్న నోటిఫికేషన్ల వరదలో మరో నోటిఫికేషన్ చేరింది. రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పురుషులకు 72, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. మల్టీజోన్ – 1 పరిధిలో 54 పోస్టులు, జోన్ 2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. కేటిగిరీల వారీగా చూస్తే ఓసీ 46, ఈడబ్ల్యూఎస్ 11, బీసీ31, ఎస్సీ 16, ఎస్టీ 7, స్పోర్ట్స్ కోటా 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంస్థ వెబ్సైట్ చూడాలని అభ్యర్ధులకు సూచించింది.