TSRTC Arranged Special Buses For Students And Women In Greater Hyderabad
mictv telugu

మహిళలు, విద్యార్థినులు కోసం ప్రత్యేక బస్సులు

March 4, 2023

TSRTC Arranged Special Buses For Students And Women In Greater Hyderabad

 

గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సు ప్రయాణమంటే కత్తిమీద సామే. ఆఫీసులు, స్కూళ్లు సమయాల్లో ఆర్టీసీ బస్సులు రద్దీగా కనిపిస్తున్నాయి. మహిళలు సైతం వేళాడుతూ ప్రయాంచాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో పోకీరీల నుంచి వేధింపులుకు కూడా గురవుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులు, మహిళల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు రూటల్లో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో తిరుగుతున్న బస్సులతో పాటు నగర శివార్లలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యార్థినులు, ఉద్యోగులు, సిబ్బంది కోసం లేడీస్‌ స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు.

ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ మీదుగా బోగారం, బోగారం నుంచి ఘట్‌కేసర్‌ మీదుగా సికింద్రాబాద్‌, ఎల్‌బీ నగర్‌ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్‌బీనగర్‌ వరకు స్పెషల్ బస్సులు పరుగులు పెడతాయి. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీ వరకు, గురునానక్ యూనివర్సిటీ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా బస్సు సర్వీసులు నడుస్తాయని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈ స్పెషల్ బస్సులను వినియోగించుకుని విద్యార్థులు, మహిళలు క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది. ఉదయం, సాయంత్రం వేళళ్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.