పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

November 27, 2019

ఆర్టీసీ బస్సు అంటే ఒకప్పుడు సురక్షితం అనే నినాదం ఉండేది. కానీ కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అందులో ముఖ్యంగా పల్లెవెలుగు బస్సులు, లోకల్ బస్సులే తరుచూ ప్రమాదాలకు గురౌతున్నాయి. దీంతో తాత్కాలిక డ్రైవర్ల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తమ ప్రయాణానికి సంకటంగా మారిందని అంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనూ పల్లెవెలుగు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. 

TSRTC Bus.

ఖమ్మంపల్లి – అడవిశ్రీరాంపూర్ మధ్య నడిచే బస్సు బుధవారం ఉదయం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప‍్రమాదంలో  పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దర్యాపూర్ మోడల్ స్కూల్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ రోడ్డు అయినప్పటికీ డ్రైవర్ వేగంగా బస్సును నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని ఆరోపించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 70 మంది ప్రయాణికులు ఉండగా అందులో 60 మంది విద్యార్థులే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నా డ్రైవర్ ఇలా అజాగ్రత్తగా వెళ్లడం ఏంటని వారి తల్లిదండ్రులు  ప్రశ్నించారు.