రైట్ రైట్.. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ లేదు - MicTv.in - Telugu News
mictv telugu

రైట్ రైట్.. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ లేదు

May 28, 2020

TSRTC Bus Lockdown Exemptions

ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ  లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరాల దృష్ట్యా బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్ 4.0 ముగుస్తుండటంతో ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో గురువారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిప్పేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. ఇంతకు ముందు వరకు జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్‌లోకి అనుమతి లేదు. దీంతో నగర శివారుల నుంచి ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ వరకు బస్సులకు అనుమతి ఇస్తామని తెలిపారు. బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బస్సు టికెట్ కలిగిన ప్రయాణీకులు రాత్రి పూట కూడా ప్రైవేటు వాహనాల్లో ఇంటికి చేరుకోవచ్చిన తెలిపారు.