ప్రయాణికులున్న ఆర్టీసీ బస్సు చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులున్న ఆర్టీసీ బస్సు చోరీ

February 17, 2020

vikarabad

ఆర్టీసీ బస్సు చోరి అయిన సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. చోరి అయిన బస్సులో ప్రయాణీకులు కూడా ఉండడం గమనార్హం. ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగుడు బస్సును నగర శివారులో వదిలేసి పారిపోయాడు. 

ఈ విషయం తెలుసుకున్న సదరు బస్సు కండక్టర్, డ్రైవర్ షాకయ్యారు. తానే డ్రైవర్‌ని అని చెప్పిన సదరు దుండగుడు బస్సును ఇష్టానురీతిగా నడిపాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని ప్రశ్నించగా.. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నాడు. ప్రయాణికులు నిలదీయడంతో అతను బస్సు వదిలేసి పారిపోయాడు. ఈ విషయంపై ప్రయాణీకులు పోలీసులకు.. ఫిర్యాదు చేశారు. వెంటనే బస్సు ఉన్న ప్రాంతానికి వచ్చిన పోలీసులు ప్రయాణీకుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై వికారాబాద్ డిపో మేనేజన్ రాజశేఖర్ మాట్లాడుతూ..తాండూరు డిపోలో బస్సును ఆపి డ్రైవర్, కండర్టర్ భోజనానికి వెళ్లారు. తరువాత వచ్చి చూడగా బస్సు కనిపించకపోవటంతో తనకు చెప్పారని తెలిపారు. గతంలో కూడా ఓ సారి కుషాయిగూడలో ఆర్టీసీ బస్సు చోరీకి గురవ్వటం జరిగింది.