గ్రేటర్‌లో టీఎస్ఆర్టీసీకి ఒక్కరోజే రికార్డు ఆదాయం - Telugu News - Mic tv
mictv telugu

గ్రేటర్‌లో టీఎస్ఆర్టీసీకి ఒక్కరోజే రికార్డు ఆదాయం

June 15, 2022

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌‌లో టీఎస్‌ఆర్టీసీకి రికార్డు ఆదాయం వసూలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం సమకూరింది. సోమవారం (ఈ నెల 13 వ తేదీ) ఆర్టీసీకి ఏకంగా రూ.5.48 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతిరోజూ రూ.2.10 కోట్ల నష్టంతో నడిచే సంస్థకే ఏకంగా 5 కోట్లకు పైగా ఆదాయం రావడం శుభ పరిణామమని జోన్‌ అధికారులు చెబుతున్నారు.

సిటీ బస్‌పాస్‌ల ద్వారా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే రూ.1.20 కోట్లు సమకూరింది. గతంలో ఈ ఆదాయం రూ.30 లక్షల వరకు ఉండేది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం.. ప్రతి ఒక్కరూ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకొని చెల్లింపులు చేయడంతో ఈ మేరకు ఆదాయం సమకూరింది. మరో వైపు విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను ఆర్టీసీ సంస్థ భారీగా పెంచిందని మండిపడుతున్నారు.