తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులను చూడాలనుకునేవారికి టీఎస్ఆర్టీసీ ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత-గోదావరి లోయలో 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు నిల్వల సందర్శన కోసం సింగరేణి దర్శన్ అనే ప్యాకేజీని అందిస్తోంది. దేశంలోనే తొలిసారిగా.. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ తవ్వకాలు, బొగ్గు గనుల్లో యంత్రాల వినియోగం తదితరాలను సామాన్యులకు కూడా చూసే వీలు కల్సిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా(రిబ్బన్ కటింగ్) సింగరేణి దర్శన్ బస్సును ప్రారంభించనున్నారన్నారు. రేపటి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ తర్వాత జనవరి 7వ తేదీ శనివారం నుంచి ఈ ప్యాకేజీ సర్వీసు ప్రతి శనివారం నడువనుంది.
First time in India
Coal tourism at Singareni Colleries provided by TSRTCExperience and learn how coal is extracted from mines and electricity is generated in this power-packed tour.
To book, Please visithttps://t.co/oxKSq7Dw0r
First trip on 28th Dec 2022. pic.twitter.com/vuGIDDXma1— Managing Director – TSRTC (@tsrtcmdoffice) December 25, 2022
బొగ్గు గనులను చూడాలనుకునే ఔత్సాహికులు రేపే తొలి సర్వీసులో ప్రయాణం చేయవచ్చు. సింగరేణి దర్శన్ అనే పేరుతో ఉండే ఈ బస్సు.. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి కరీంనగర్ బస్టాండుకు 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌కు రాత్రి 8 గంటలకు, సికింద్రాబాద్‌కు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. టికెట్ ధర జేబీఎస్ నుంచి రూ.1,600, కరీంనగర్ నుంచి రూ.800గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్(వెజ్ మాత్రమే) సదుపాయం కూడా కల్పిస్తారు. www.tsrtconline.in వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు’’ అని కరీంనగర్ రీజియన్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ వెల్లడించారు.. మరిన్ని వివరాలను 040-69440000 లేదా 040-23450033 నెంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు పొందవచ్చు.