టీఎస్ఆర్టీసీ మరోసారి చార్జీల పెంపు.. ఈ సారి మాత్రం - MicTv.in - Telugu News
mictv telugu

టీఎస్ఆర్టీసీ మరోసారి చార్జీల పెంపు.. ఈ సారి మాత్రం

April 15, 2022

bus

తెలంగాణ ఆర్టీసీ ఇటీవల పలు రకాలుగా టిక్కెట్ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. రెండు సార్టు నేరుగా టిక్కెట్ చార్జీలు పెంచగా, ఇంకోసారి డీజిల్ సెస్ పేరుతో పెంచింది. ఇప్పుడు రిజర్వేషన్ల వంతు వచ్చింది. ఒక్కో రిజర్వేషన్ టిక్కెట్‌పై రూ. 20 నుంచి 30 వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో కనీస చార్జీని రూ. 10 గా చేసింది. చిల్లర సమస్య కారణంగా రౌండప్ చార్జీలను విధించింది. డీజిల్ రేట్లు పెరిగిన కారణంగా ప్రత్యేకంగా సెస్సు పేరుతో బస్సుల ఆధారంగా రేటు పెంచింది. పైగా డీజిల్ రేటు ఇంకా పెరిగితే చార్జీలను కూడా ఆ మేరకు పెంచుతామని స్పష్టం చేసింది.