తెలంగాణలో ఆర్టీసీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రెండు సార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపింది. ఇప్పుడు మరోమారు రేట్లను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో రేట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పెంచిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ రేట్లు రెండు కేటగిరీలుగా అమలు కానున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ వంటి బస్సుల్లో రూ. 2 పెరగనున్నాయి. ఎక్స్ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో రూ.5 పెరగనుంది. అంతేకాక, ఇప్పటి నుంచి ఏ బస్సులోనైనా కనీస టికెట్ ధరను రూ.10కు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం వల్ల పేదలు, సామాన్యులపై తీవ్ర భారం పడనుంది.