దసరాకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు - MicTv.in - Telugu News
mictv telugu

దసరాకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

October 20, 2020

nvnvhn

దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ 3000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బస్సుల రూట్లలో కూడా స్వల్పంగా మార్పులు చేశారు. నిజామాబాద్, కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌, జేబీఎస్‌ నుంచి నడుస్తాయి. యాదగిరిగుట్ట, పరకాల, జనగాం, నర్సంపేట, మహబూబాబాద్‌,  వరంగల్, తొర్రూర్‌‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి నడువనున్నాయి. 

నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడుస్తాయన్నారు. ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, టెలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, అమీర్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌తోపాటు జంటనగరాల్లోని శివారు ప్రాంతాల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నడిపే బస్సులకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించారు.