ఆర్డరిస్తే ఆర్టీసీలో మామిడి పండ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్డరిస్తే ఆర్టీసీలో మామిడి పండ్లు

May 4, 2022

టీఎస్సార్టీసీ సజ్జనార్ వచ్చిన తర్వాత కొత్త కొత్త ప్రయత్నాలతో ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ కార్గో మరో ఆఫర్ తెచ్చింది. స్వచ్ఛమైన బంగిన పల్లి మామిడి పండ్లను వినియోగదారులకు సరఫరా చేస్తామని ప్రకటించింది. రసాయనాలతో కాకుండా సహజమైన పద్ధతుల్లో మగ్గబెట్టిన పండ్లనే ఆర్డరుపై ఇంటికి పంపిస్తామని వెల్లడించింది. దీని వల్ల వినియోగదారులకు మంచి క్వాలిటీ పండ్లు లభ్యమవుతాయి.

ఇదే సమయంలో రైతులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం సంస్థ మామిడిపండ్లకు ఫేమస్ అయిన జగిత్యాల ప్రాంత రైతులతో ఒప్పందం కుదుర్చుకొంది. 5, 10, 15, 20 ఇలా టన్ను వరకు సంస్థ వెబ్‌సైటులో వెళ్లి ఆర్డరివ్వవచ్చు. ఐదు కిలోలకు రూ. 581, పది కిలోలకు రూ. 1162, 15 కిలోలకు రూ. 1743, 500 కేజీలకు రూ. 58,075 చొప్పున ధర చెల్లించాల్సి ఉంటుంది. కావాలసిన వారు 040- 23450033, 69440000 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.