tsspdcl 1000 Junior Lineman Notification 2022 Registration Begins Form May 19
mictv telugu

1000 జూనియర్ లైన్‌మెన్(JLM) ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేయండి

May 17, 2022

tsspdcl 1000 Junior Lineman Notification 2022 Registration Begins Form May 19

తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల నియామకాలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్పీడీసీఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 1000 ఉండగా, సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు 201 ఉన్నాయి. జూనియర్ లైన్‌మెన్(జెఎల్ఎమ్) పోస్టులకు మే 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 8 దరఖాస్తులకు చివరితేది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 17 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పూర్తి వివరాలను https://tssouthernpower.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

• విద్యార్హతలు: పదవ తరగతితో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసై ఉండాలి.
• వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుదారుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
• దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.

ఖాళీలు ఉన్న జిల్లాలు:
మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.