వరుస నోటిఫికేషన్‌లతో నిరుద్యోగులకు శుభవార్త అందిస్తున్న తెలంగాణ సర్కార్ మరో నోటిఫికేషన్‌తో విడుదల చేయనుంది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSSPDCL)లో 1,601 ఖాళీల భర్తీ చేస్తున్నట్టు ఓ నోటీసు విడుదలైంది. దీని ప్రకారం జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553 ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులు-48 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పరీక్ష తేదీ, సిలబస్ లాంటి వివరాలు త్వరలో పూర్తి నోటిఫికేషన్‌లో పొందుపర్చనున్నారు. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Breaking News : గ్రూప్-4 పరీక్ష షెడ్యూల్ విడుదల
ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ కోల్పోయాడు..