TTD appeal to devotees
mictv telugu

ఐదు రోజులు తిరుమలకు రాకండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

August 9, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తులకు కీలక సూచన చేసింది. ఆగస్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవులు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో రావొచ్చని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్లాన్ వేసుకొని వసతి, దర్శనం పక్కాగా చేసుకొని రావాలని భక్తులను కోరుతోంది. రద్దీ భారీగా ఉండే అవకాశాలు ఉండడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అటు తమిళుల పవిత్రమైన పెరటాసి మాసం రావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆ మాసం ముగిసే అక్టోబరు 17 తర్వాత రావాలని విజ్ఞప్తి చేసింది. దర్శనం కోసం క్యూకాంప్లెక్స్‌లో గంటల తరబడి నిలిచే ఓపిక ఉంటే అందుకు సంసిద్ధతతో రావాలని స్పష్టం చేసింది.