TTD bans plastics in Thirumala
mictv telugu

టీటీడీ భక్తులకు ముఖ్య గమనిక.. రేపట్నుంచి తిరుమలలో నిషేధం అమలు

May 31, 2022

TTD bans plastics in Thirumala

కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శంచుకునే భక్తులకు టీటీడీ మంగళవారం ముఖ్య గమనికను జారీ చేసింది. బుధవారం నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కొండపై ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

అందులో భాగంగా అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే పరికరాలతో నిఘా పెడుతున్నట్టు తెలిపింది. భక్తులతో పాటు కొండపై వ్యాపారం చేసేవారు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణలో తమ వంతుగా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరింది.