టీటీడీలో 17 మందికి కరోనా.. ఒక్క భక్తుడికీ సోకలేదు..  - MicTv.in - Telugu News
mictv telugu

 టీటీడీలో 17 మందికి కరోనా.. ఒక్క భక్తుడికీ సోకలేదు.. 

July 4, 2020

hvgg

టీటీడీని కరోనా వదలడం లేదు. తరుచూ సిబ్బంది వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 17 మంది సిబ్బందికి వ్యాధి సోకింది. ప్రతిరోజూ వేలాది మంది తరలివచ్చే ఆలయంలో సిబ్బంది అనారోగ్యంబారిన పడుతుంటంతో కలకలం రేపుతూనే ఉంది. ఇందులో ముఖ్యంగా అర్చకులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆలయంలో ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో విధుల కారణంగా ఉద్యోగులకు కరోనా సోకలేదని అన్నారు. సిబ్బందికి వ్యాధి వచ్చినా కూడా భక్తులు ఎవరికి  సోకలేదని చెప్పారు. 

ఉద్యోగుల్లో మనోదైర్యాన్ని నింపుతామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని కూడా వేస్తామన్నారు. 15 రోజుల పాటు ఉద్యోగులు తిరుమలలోనే విధులు నిర్వర్తించేలా మార్పులు చేయాలన్నారు. ఇక తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరిక్షలు నిర్వహించిన అనంతరం అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవలను ఇప్పట్లో ప్రారంభించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల చివరి వరకు భక్తులు సంఖ్యని పెంచబోమన్నారు. కరోనా సమయంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకే టీటీడీ ప్రాధ్యనమిస్తోందన్నారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్యని పెంచాం అని కోంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రోజుకు 6వేల మంది భక్తులకు దర్శనాలు కల్పించారు. ఇటీవల వాటిని 12 వేల వరకు పెంచారు. ఇక ఇప్పట్లో భక్తుల సంఖ్య పెంచబోమని తెలిపారు.