క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి దంపతులు - MicTv.in - Telugu News
mictv telugu

క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి దంపతులు

July 8, 2020

yv subba reddy

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నో ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెల్సిందే. ఈయన టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలో సీఎం జగన్ కుటుంబం నివాళి అర్పించింది. ఈ సందర్భంగా నిర్వహించిన క్రైస్తవ ప్రార్థనల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. దీనిపై జనసేన నాయకులు మండిపడుతున్నారు.

హిందుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైవీ సుబ్బారెడ్డి ప్రవర్తిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతరెడ్డి బైబిల్ పట్టుకొని క్రీస్తు ప్రార్ధన ఎలా చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై వైవీ సుబ్బారెడ్డి దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు. హైందవేతరులకు టీటీడీ ఉన్నత పదవుల్లో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. వెంటనే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రత్యక్ష ఆందోళనకు దొగుతామని జనసేన నాయకులు హెచ్చరించారు.