TTD decided To Expand Srivari Parakamani
mictv telugu

వెల్లువలా విరాళాలు.. రూ.10 కోట్లతో నూతన పరకామణి: టీటీడీ

June 20, 2022

TTD decided To Expand Srivari Parakamani

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల వాసుడైన శ్రీనివాసుడికి భారీగా విరాళాలు వస్తున్నాయి. శ్రీవారికి కానుకలు విపరీతంగా పెరగడంతో టీటీడీ పరకామణిని విస్తరించేందుకు సిద్ధమైంది. రూ.10కోట్లతో ఆలయం వెలుపల నూతన పరకామణి భవనాన్ని నిర్మిస్తోంది. ఏటా రూ.1000 కోట్లకు పైగా శ్రీవారి హుండీ ఆదాయం వస్తుంది. ఏటా సుమారు 1200 కేజీల బంగారు కానుకలు వస్తున్నాయి. రోజుకు రూ.4కోట్ల నుంచి రూ.6కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వస్తుంది.

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు నగదును కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు. స్వదేశీ కరెన్సీ నోట్ల నుంచి విదేశీ డాలర్ల వరకు శ్రీవారి హుండీలో కానుకల రూపంలో సమర్పించి మొక్కులు చెల్లిచుకుంటారు. హుండీలో వచ్చిన కానుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరకమణిలో హుండీ ద్వారా స్వామి వారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తుంటారు. ఈ పరకామణిని నోట్ల పరకామణిని., నాణేల పరకామణి ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. వీటిని మరింత పటిష్ఠ భద్రత నడుమ లెక్కించేందుకు మరో నూతన భవనాన్ని నిర్మిస్తోంది టీటీడీ.