టీటీడీ సంచలనం.. 75% ఉద్యోగాలు చిత్తూరు వాళ్లకే.. - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ సంచలనం.. 75% ఉద్యోగాలు చిత్తూరు వాళ్లకే..

November 12, 2019

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తాజగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల్లో 75 శాతం వెంకటేశ్వరస్వామి కొలువైన చిత్తూరు జిల్లా వాసులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమాన్ కరుణాకర్ రెడ్డి మంగళవారం జరిగన బోర్డు సమావేశంలో ఈమేరకు ప్రతిపాదన చేశారు. దీనికి పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తీర్మానాన్ని అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. 

Ttd.

టీడీడీలో ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మెరిట్, ఇతర నిబంధనల మేరకు నియమామకాలు సాగుతున్నాయి. ఫలితంగా ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఎంపిక అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడానికి టీటీడీ 75 రిజర్వేషన్ నిర్ణయం తీసుకుంది.టీడీడీకి వచ్చే ఆదాయాన్ని వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే.