TTD devotees..Brahmotsavala schedule release
mictv telugu

టీటీడీ భక్తుల్లారా..బ్ర‌హ్మోత్స‌వాల షెడ్యూల్ విడుదల

September 2, 2022

తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానం కాసేపటిక్రితమే భక్తులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. తిరుమలలో కొలువై ఉన్న క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలకు సంబంధించి, శ్రీవారి ఆయా వాహ‌న సేవ‌ల వివ‌రాలను వెల్లడించారు. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ భక్తుల మధ్య స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను భ‌క్తుల స‌మ‌క్షంలో నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం బ్ర‌హ్మోత్స‌వాల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం.. బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కావ‌డానికి ముందుగా ఈ నెల 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కోయిల్ అళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఈ నెల 26న బ్ర‌హ్మోత్స‌వాలకు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుండ‌గా…. ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ వాహ‌న సేవ‌ల్లో శ్రీవారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆయా వాహ‌న సేవ‌ల వివ‌రాలు..
1.సెప్టెంబ‌ర్ 26.. బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌
2.సెప్టెంబ‌ర్ 27..ధ్వ‌జారోహ‌ణం, పెద్ద శేష వాహ‌న సేవ‌
3.సెప్టెంబ‌ర్ 28..చిన్న శేష వాహ‌నం, స్న‌ప‌న తిరుమంజ‌నం, హంస వాహ‌న సేవ‌
4.సెప్టెంబ‌ర్ 29..సింహ వాహ‌న సేవ‌, ముత్య‌పు పందిరి వాహ‌న సేవ‌
5.సెప్టెంబ‌ర్ 30..క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌, స‌ర్వ భూపాల వాహ‌న సేవ‌
6.అక్టోబ‌ర్ 01..మోహిని అవ‌తారంలో స్వామి, గ‌రుడ వాహ‌న సేవ‌
7.అక్టోబ‌ర్ 02..హ‌నుమంత వాహ‌న సేవ‌, గ‌జ వాహ‌న సేవ‌
8.అక్టోబ‌ర్ 03..సూర్యప్ర‌భ వాహ‌న సేవ‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ‌
9.అక్టోబ‌ర్ 04..ర‌థోత్స‌వం, అశ్వ వాహ‌న సేవ‌
10.అక్టోబ‌ర్ 05..చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం