టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ  - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ 

October 1, 2020

TTD EO Anil Singhal Transfer

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది.  అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే కొత్త ఈవో నియామకం చేపట్టే అవకాశం ఉంది. వీరిలో ప్రముఖంగా జవహర్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 16 నుండి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ బదిలీ జరగడం గమనార్హం.

అనిల్ సింఘాల్ 2017 మే నుంచి టీటీడీ ఈవోగా పని చేస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా ఆయన పని చేశారు. అప్పటి టీడీపీ హయాంలో ఈయన నియామకం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏడాదిన్నర పాటు అదే శాఖలో ఉన్నారు. ఐఏఎస్ అధికారులు ఒకే చోట మూడేళ్లకు పైగా పని చేయకూడదనే నిబంధన కారణంగాయన ఈ బదిలీ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. కాగా,1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ నియామకంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల వారిని నియమించవద్దని చాలా మంది అభ్యంతరం చెప్పారు. అయినా కూడా తన పనితీరుతో ఆ విమర్శలకు చెక్ పడింది.