టీటీడీలో నిధులు గల్లంతు.. విచారణ! - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీలో నిధులు గల్లంతు.. విచారణ!

August 23, 2019

TTD funds to be lost .. Inquiry!

దేశ రాజధాని ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంలో నిధుల గోల్‌మాల్ సంచలనంగా మారింది. రూ. 4 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీపీ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. పూజా వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఓ భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తుకు దిగాలని టీటీడీ ఆదేశాలు జారీచేసింది. 

అయితే విచారణను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ అడ్డుకున్నారు. దీంతో విచారణ నిలిచిపోయింది. కమిషనర్ వ్యవహారంపై సదరు భక్తుడు ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు మళ్లీ విచారణకు ఆదేశించారు. రెండు రోజుల నుంచి ఢిల్లీలోని ఏఈవో ఆఫీసులో రికార్డులను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.