తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి నిజమో, అబద్ధమో తెలియక భక్తులు అయోమయంలో పడిపోతున్నారు. తాజాగా మరో విషయంపై ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. శ్రీవారి దర్శనాన్ని 6 నెలల పాటు నిలిపేస్తారని ఆ వార్త సారాంశాం. బంగారు తాపడం పనులు సందర్బంగా దర్శనం దర్శనం నిలిపివేస్తారని పుకార్లు వినిపించాయి. శ్రీ వారి దర్శనం నిలిపివేతపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయమని ఆలయ అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. బంగారు తాపడం పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు తప్పా.. స్వామి వారి దర్శనం నిలివేయడం లేదని వివరించారు. ఎప్పటిలాగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు తరలి రావొచ్చన్నారు. ఇక బాలాలయం ఏర్పాటుకు 2023 మార్చి 1 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారన్నారు. వారం ముందుగానే బాలలయ నిర్మాణానికి వైదిక క్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలలయంలో ఏర్పాటు చేసే దారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు. ఆ తరువాత బంగారు తాండపం పనులు చేపడతారని..ఈ 6 నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని, బాలలయంలో దారు విగ్రహాన్ని భక్తులు దర్శించుకోవచ్చన్నారు.