టీటీడీ కీలక ప్రకటన.. రేపటి నుంచి - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ కీలక ప్రకటన.. రేపటి నుంచి

April 12, 2022

vbcb

తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం కీలక ప్రకటన చేసింది. తిరుమలలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు ప్రధాన కారణం.. నేడు శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తుల మధ్య తోపులాట జరిగి, ముగ్గురు భక్తులకు గాయాలు కావడంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, రేపటి నుంచి ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శన టోకెన్ల పంపిణీ నిలిపివేత భక్తుల రద్దీ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత కొవిడ్ పూర్వ విధానాన్ని టీటీడీ పునరుద్ధరించింది. భక్తులను వైకుంఠం కాంప్లెక్స్‌లోకి అనుమతించింది. తొలుత టోకెన్లు తీసుకున్న వారిని మధ్యాహ్నం 2 గంటలకు అనంతరం టోకెన్లు తీసుకోని వారందరినీ కంపార్టుమెంట్లలోకి అనుమతించనుంది. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందని, కావున భక్తులు సంసిద్ధతతో తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ కోరింది.

మరోపక్క శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుమలకు మంగళవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల తర్వాత టీటీడీ టోకెన్ల పంపిణీని చేపట్టడంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని, తోపులాట చోటుచేసుకుంది. దీంతో నేడు టోకెన్లు లేకున్నా, భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు.