టీటీడీ కీలక నిర్ణయం.. విఐపీ దర్శనాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ కీలక నిర్ణయం.. విఐపీ దర్శనాలు రద్దు

February 25, 2022

తిరుమల తిరుపతి దేవస్ధానం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని, ఇక నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో విఐపీ దర్శనాలను రద్దు చేసింది. దానికి సంబంధించిన ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. “శ్రీవారి సర్వదర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర, శని, ఆదివారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశాం.

విఐపిల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయిస్తాం. అలాగే.. శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారీ చేస్తాం” అని పేర్కొంది. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తోంది. తాజాగా ఈ నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.