TTD Kitakita with devotees..6 kms
mictv telugu

భక్తులతో టీటీడీ కిటకిట..6 కిలోమీటర్ల క్యూ

August 14, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. వరుసగా సెలవులు రావడంతో ఆయా రాష్ట్రాల నుంచి వెంకన్న స్వామి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో అధికారులు ఊహించని రీతిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శ నానికి 38 కంపార్టుమెంట్లలో భక్తులు గంటలకొద్దీ వేచియున్నారు.

స్వామివారి దర్శనానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. ”శ్రీవారి సేవాసదన్‌, రాంభగీచ వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. వీరికి 36 గంటల్లో దర్శనం కలుగుతుంది. భక్తుల రాక పెరుగుతున్న దృష్ట్యా దర్శనం 48 గంటలు పట్టవచ్చు. నిన్న 83,452 మంది భక్తులు దర్శించుకోగా 50వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 21 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. వీఐపీ బ్రేక్‌ , పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశాం. నేడు 6 కిలోమీటర్లు మేర భక్తులు క్యూ కట్టారు” అని పేర్కొన్నారు.