టీటీడీ బోర్డులో క్రైస్తవురాలికి చోటు.. రగడ.. - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ బోర్డులో క్రైస్తవురాలికి చోటు.. రగడ..

April 21, 2018

తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం నిషిద్ధం. అన్యమతాల ఉద్యోగులను కూడా తీసుకోవద్దని డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. టీడీటీ కొత్త పాలకమండలిలో పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనితకు సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక క్రైస్తవురాలిని, నిత్యం బైబిల్ పట్టుకుని తిరిగే వ్యక్తికి హిందువుల పవిత్ర ఆలయ బోర్డులో చోటు కల్పించడం సమంజసం కాదని అంటున్నారు.

కొత్త పాలకమండలిలో చైర్మన్, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. అనితకు సభ్యత్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. తలాతోకా లేని నిర్ణయాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని హిందూ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆమె స్వయంగా తాను క్రైస్తవురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పారని, అలాంటి వ్యక్తికి పట్టం కట్టబెట్టడం సరికాదని స్వామి పరిపూర్ణానంద విమర్శించారు. అనిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వద్ద ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైలర్ అవుతోంది. అనిత ఇప్పుడు కూడా బైబిల్ తీసుకుని కొండపైకి వెళ్తే హిందువుల మనోభావాలు గాయపడవా? అని హిందు సంఘాల నేతలు అంటున్నారు.