తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ఏర్పాటుచేశారు. పాలకమండలిలో కొత్తవారికి ఎక్కువగా అవకాశం కల్పించినట్లు టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలకవర్గంతో పోలిస్తే ఈ సారి సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పుజరిగింది.
ఈ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగనున్నారు.
పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్కు అవకాశం కల్పించారు.
టీటీడీ పాలకమండలి జాబితా
ఆంధ్రప్రదేశ్ నుండి పోకల అశోక్ కుమార్,మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి,కాటసాని రాంభూపాల్ రెడ్డి,గొర్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్ , తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వర రావు, జీవన్ రెడ్డి , లక్ష్మీనారాయణ,పార్థసారథి రెడ్డి,మారంశెట్టి రాములు,కల్వకుర్తి విద్యాసాగర్ రావు,తమిళనాడు నుంచి శ్రీనివాసన్ ,ఎమ్మెల్యే నందకుమార్,కన్నయ్య, కర్ణాటక నుంచి శశిధర్ , ఎమ్మెల్యే విశ్వనాధ రెడ్డి,మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్కు అవకాశం కల్పించారు. మారుతి ,సౌరభ్,కేతన్ దేశాయ్ , శ్రీనివాసన్ పేర్లు పాలకమండలి సభ్యుల జాబితాలో ఉన్నట్లు సమాచారం.