టీటీడీపై కోర్టుకెక్కిన అన్యమత ఉద్యోగులు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీపై కోర్టుకెక్కిన అన్యమత ఉద్యోగులు

February 2, 2018

తిరుమల, తిరుపతి దేవస్థానంలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని ఇటీవల పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేరే మతాలను అనుసరిస్తూ ఎందుకు ఇంకా ఈ హిందూ ఆలయంలో పనిచేస్తున్నారో వివరణ ఇవ్వాలని  మొత్తం 45 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. దీన్ని సదరు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ జరపనుంది .అన్యమత ఉద్యోగులను తొలగించేందుకు టీటీడీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అయితే అన్యమతస్తును ఉద్యోగాల్లో కొనసాగనివ్వాలని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. కానీ పలు హిందూ సంస్థలు మాత్రం టీటీడీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నాయి. చర్చీలు, మసీదుల్లో వేరే మతాలవారిని ఉద్యోగాలు ఇవ్వనప్పుడు హిందూ ఆలయమైన ఈ గుడిలో అన్యమతస్తులకు వేల రూపాయల ఉద్యోగాలు ఎందుకివ్వాలని మండిపడుతున్నాయి.  టీటీడీలో  1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007లో ఇకపై ఇలా జరగొద్దని టీటీడీ పాలకమండలి  తీర్మానం చేసింది. కానీ తర్వాత కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఏడుగురు ఉద్యోగాల్లో చేరారు.